NTV Telugu Site icon

Rohit Sharma: కంటతడి పెట్టిన పాకిస్తాన్ ప్లేయర్.. ఓదార్చిన రోహిత్ శర్మ!

Naseem Shah Cry

Naseem Shah Cry

Rohit Sharma appreciating Naseem Shah: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పరాజయాల పరంపరను పాకిస్తాన్ కొనసాగిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు టీమిండియాతో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఏడింటిలో ఓడింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠతకు గురిచేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్లేయర్స్ కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.

టీమిండియా చేతిలో ఓటమిని పాకిస్తాన్ పేసర్ నసీమ్ షా తట్టుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతి అనంతరం మైదానంలోనే నేలకూలిపోయాడు. షహీన్ ఆఫ్రిదిని పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. పెవిలియన్ చేరుతుండగా.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని అతడు ఆపుకోలేపోయాడు. నసీమ్ కంటతడి పెట్టుకోవడాన్ని గమనించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థి ఆటగాడైనా.. రోహిత్ ఓదార్చిన విధానంపావు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?

పాకిస్థాన్‌కు చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమయ్యాయి. అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే ఇమాద్ వసీంను పెవియన్ చేర్చాడు. క్రీజులోకి టెయిలెండర్ నసీమ్ షా వచ్చాడు. రెండో బంతి సింగిల్ తీసిన అతను.. 4, 5 బంతులను బౌండరీకి తరలించాడు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ టై అవుతుంది. దాంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అయితే అర్ష్‌దీప్ అద్భుత బంతిని సాధించగా.. నసీమ్ షా సింగిల్ మాత్రమే తీశాడు. పాక్ ఓడిపోవడంతో అతడు మైదానంలో కుప్పకూలిపోయాడు. అనూహ్య ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. అద్భుత బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్‌ను మెచ్చుకున్న రోహిత్.. నసీమ్ దగ్గరకు వెళ్లి బాగా ఆడావ్ అని అతన్ని ఓదార్చాడు.

Show comments