Rishabh Pant: జనం చూస్తే ఎలా అని భయపడ్డాను: పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant on Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తాను అస్సలు బతుకుతానని కూడా అనుకోలేదని, కానీ దేవుడు దయతలిచాడు అని పేర్కొన్నాడు. 2022 డిసెంబరు 30న పంత్ కారు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో మంటలు చెలరేగగా.. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అతడిని బయటికి తీశాడు. దాంతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
గాయాలు, సర్జరీలతో ఏడాదిన్నర పాటు రిషబ్ పంత్ ఆటకు దూరమయ్యాడు. రెండు నెలల కిందట ఐపీఎల్ 2024తో పునరాగమనం చేశాడు. పునరాగమనం చేయడమే కాదు.. అద్భుతంగా ఆడాడు కూడా. 11 ఇన్నింగ్స్‌లలో 398 రన్స్ చేశాడు. బ్యాటర్, కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో అతడికి టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత జెర్సీలో పంత్ కనిపించనున్నాడు. తుది జట్టులో చోటు కోసం అతడు సంజూ శాంసన్‌తో పోటీ పడాల్సి ఉంది. ఐపీఎల్ 2024లో సంజూ అదరగొట్టిన విషయం తెలిసిందే.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Janhvi Kapoor Marriage: వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు: జాన్వీ
శిఖర్ ధావన్ టాక్ షోలో రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘రోడ్డు ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది. నేను బతుకుతానని కూడా అనుకోలేదు. కానీ ఆ దేవుడు నాపై దయతలిచాడు. చికిత్స చేసుకోవడానికి బయటికి వెళ్లాల్సి వచ్చేది. ఆరంభంలో నేను విమానాశ్రయానికి వెళ్లలేకపోయా. చక్రాల కుర్చీలో జనానికి కనపడడానికి చాలా భయపడ్డా. రెండు నెలల పాటు కనీసం పళ్లు తోముకోలేకపోయాను. ఏడు నెలల పాటు భరించలేని నొప్పితో బాధపడ్డా. అదంతా ఇప్పుడు తలుచుకుంటే.. భయమేస్తుంది’ అని చెప్పాడు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?