AUS vs BAN: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్!
- బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్
- ప్యాట్ కమిన్స్ చరిత్ర
- ఓవరాల్‌గా ఏడో హ్యాట్రిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Takes Hat-Trick in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ పడగొట్టడడంతో కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 2007లో బంగ్లాదేశ్పైనే మాజీ పేసర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్ దశలో తేలిపోయిన కమిన్స్.. కీలక సూపర్-8లో ఫామ్ అందుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.
బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను వరుస బంతుల్లో ప్యాట్ కమిన్స్ ఔట్ చేశాడు. 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మహ్మదుల్లా, మహెదిలను ఔట్ చేసిన కమిన్స్.. 20వ ఓవర్ తొలి బంతికి హృదయ్‌ను పెవిలియన్ చేర్చాడు. మహ్మదుల్లా బౌల్డ్ కాగా.. మహెది, హృదయ్‌లు క్యాచ్ ఔట్ అయ్యారు. కమిన్స్ హ్యాట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ ఇదే కావడం విశేషం.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: Lenovo Yoga Pro 7i Price: ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్.. సూపర్ లుకింగ్, బెస్ట్ పెర్మామెన్స్!
టీ20 ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా ప్యాట్ కమిన్స్ ఏడో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ (2007), ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ (2021), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ (2021), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (2021), యూఏఈ బౌలర్ కార్తిక్ మైయప్పన్ (2022), ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ (2022) ఈ ఘనత సాధించారు. 2024లో ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ పడగొట్టాడు.
PAT CUMMINS BECOMES THE FIRST AUSTRALIAN TO TAKE MEN’S T20I WC HAT-TRICK AFTER 17 LONG YEARS. 🐐 pic.twitter.com/rt9rC5hImA
— Johns. (@CricCrazyJohns) June 21, 2024
తాజావార్తలు
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!