Lenovo Yoga Pro 7i Price: ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్.. సూపర్ లుకింగ్, బెస్ట్ పెర్మామెన్స్!
- భారత్‌లో సరికొత్త ల్యాప్‌టాప్
- ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్
- ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Yoga Pro 7i Laptop Price in India: చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘లెనొవో’ భారత్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. యోగా సిరీస్‌లో భాగంగా ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్.. తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మల్టీటాస్కింగ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూతో యోగా ప్రో 7ఐ వస్తోంది.
లెనొవో యోగా ప్రో 7ఐ ల్యాప్‌టాప్ ధర రూ.1.5 లక్షలుగా ఉండడం గమనార్హం. అల్యూమినియం ఛాసిస్, బ్యాక్‌లిట్ కీ బోర్డుతో ల్యాప్‌టాప్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. కృత్రిమ మేధ ఫీచర్ల కోసం ప్రత్యేకంగా ‘కోపైలట్ కీ’ని పొందుపర్చారు. ఇందులో 120Hz రీఫ్రెష్ రేటు, డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్, ఓలెడ్ స్క్రీన్‌తో కూడిన 14 ఇంచెస్ (1800×2880 pixels) డిస్‌ప్లే ఉంటుంది. 16GB డ్యూయల్ ఛానెల్ ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఇది టీల్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ బరువు సుమారు 2 కిలోలు.
Also Read
Also Read: OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!
యోగా ప్రో 7ఐ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్‌తో రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2021 ఎడిషన్‌ను ఇందులో ఇచ్చారు. మల్టీమీడియా అనుభూతి కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్, హెచ్‌డీ ఆడియో చిప్ ఉంది. క్వాడ్ మైక్, డెప్త్ సెన్సర్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ఐఆర్ కెమెరా కూడా ఉన్నాయి. ‘విండోస్ హలో’ సపోర్ట్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను మీరు 360 డిగ్రీలు మడవలేరు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!