Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Pakistan Likely To Out From T20 World Cup 2024 Group Stage

Pakistan Super 8: అయ్యో పాపం.. టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి పాకిస్థాన్ ఔట్!

Published Date :June 10, 2024 , 10:12 am
By Sampath Kumar
Pakistan Super 8: అయ్యో పాపం.. టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి పాకిస్థాన్ ఔట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

It will be difficult for Pakistan to qualify for the T20 World Cup 2024 Super 8: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024‌ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2024లో మాదిరి భారీ స్కోర్లు నమోదవకున్నా.. సూపర్ ఓవర్లు, ఉత్కంఠ ఫలితాలతో మెగా టోర్నీ మ్యాచ్‌లు అభిమానులకు మంచి మజాను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పసికూన జట్లు ఐసీసీ టాప్ టీమ్స్‌కు షాక్ ఇస్తూ సంచనాలు నమోదు చేస్తున్నాయి. దాంతో కొన్ని టాప్ టీమ్స్ సూపర్ 8కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టే పరిస్థితి నెలకొంది. ఈ జాబితాలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఉంది.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌లు (ఐర్లాండ్, పాకిస్తాన్) గెలిచిన భారత్ 4 పాయింట్స్‌తో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో కెనడా, అమెరికాలతో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. టీమిండియా కనీసం ఒకటి గెలిచినా సూపర్ 8కు చేరుతుంది. పాకిస్థాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా.. 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో (భారత్, ఐర్లాండ్‌) ఒక్కటి గెలిచినా యూఎస్ ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. రన్‌రేట్ కూడా 0.626తో మెరుగ్గానే ఉండడంతో సూపర్ 8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఓడిన పాకిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్ స్టేజ్‌లో నుంచే నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూఎస్, భారత్ చేతుల్లో ఓడిన పాక్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, కెనడాతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా.. పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. అదే సమయంలో రన్‌రేట్ కూడా బాగుండాలి. పాక్ సూపర్ 8 చేరాలంటే యూఎస్ తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. ఒక్కటి గెలిచినా.. పాక్ పని ఔట్. పాక్ భవితవ్యం మొత్తం ఇప్పుడు యూఎస్ మీద ఆధారపడి ఉంది.

Also Read: Rohit Sharma: ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది: రోహిత్

కెనడా ఓ మ్యాచ్‌లో గెలిచి.. మరోదాంట్లో ఓడి మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్, భారత్‌లతో కెనడా ఆడాల్సి ఉంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి కెనడాకు అంత ఈజీ కాదు. ఐదవ స్థానంలో ఉన్న ఐర్లాండ్.. భారత్, కెనడాపై ఓడింది. యూఎస్, పాకిస్తాన్ జట్లతో ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ ప్రస్తుత ఫామ్ చూస్తే గెలుపు కష్టమే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ లేదా ఐర్లాండ్ సూపర్ 8కు చేరుకోవు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • How Pakistan Qualif Super 8
  • ind vs pak
  • India vs Pakistan
  • Pakistan Super 8
  • Pakistan Super 8 Scenario

తాజావార్తలు

  • Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

  • Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

  • Onion Pickle Recipe: క్షణాల్లో ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అడుగుతారు అంతే..!

  • Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

  • Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions