Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలిచింది.
పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ… ‘టాస్ గెలిచి మొదటి 6 ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడం మాకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వికెట్లు తీసి పాకిస్తాన్‌ను ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాం. బాబర్, షాబాద్ భాగస్వామ్యం అనంతరం పాక్ భారీ స్కోర్ చేస్తుందని తెలుసు. కానీ మా బౌలర్లు అద్భుతం చేశారు. 160 పరుగుల లక్ష్యం కాబట్టి మేం ఛేదిస్తామని అనుకున్నాం. అందుకు మంచి భాగస్వామ్యం అవసరం అని తెలుసు. మేం అదే చేశాం. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతి సంవత్సరం రాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని తెలిపాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: PAK vs USA: అమెరికా మా కంటే మెరుగ్గా ఆడింది: బాబర్ ఆజామ్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేయగా.. పాక్ ఒక వికెట్ నష్టానికి 13 రన్స్ చేసి ఓడింది.
తాజావార్తలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!