Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 117 టీ20 మ్యాచ్‌ల్లో 4037 రన్స్ చేశాడు. అమెరికాతో మ్యాచ్‌కు రెండో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్.. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీని దాటాడు. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 152 మ్యాచ్‌ల్లో 4027 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి మధ్య పరుగుల తేడా పెద్దగా లేకపోవడంతో.. టీ20 ప్రపంచకప్ 2024లో బాబర్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సమంగా పోరాడనప్పటికి.. సూపర్ ఓవర్‌లో పాక్‌కు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఎస్ 18 పరుగులు చేయగా.. పాక్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!