NTV Telugu Site icon

MS Dhoni: నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది.. వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇది: ఎంఎస్ ధోనీ

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni’s Instagram Post Goes Viral: బార్బడోస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను భారత్ ఒడిసిపట్టింది. ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన టీమిండియాకు రెండో కప్‌ గెలవడానికి 17 ఏళ్లు పట్టింది. చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవడంతో భారతదేశం మొత్తం ఆనందంలో తెలియాడుతోంది. ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత విజయం అనంతరంటీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ అయింది.

Also Read: Suryakumar Yadav Catch: ‘సూర్యా’ భాయ్.. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌ (వీడియో)!

టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్ మ్యాచ్‌ సమయంలో తన హార్ట్‌ రేట్‌ పెరిగిపోయిందని, వెలకట్టలేని బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. ‘ప్రపంచకప్‌ 2024 ఛాంపియన్స్‌. ఫైనల్ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విశ్వ విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి ఫలితం రాబట్టడం అద్భుతం. ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. వెలకట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ధోనీ అన్నాడు. జులై 7న ధోనీ బర్త్‌డే అన్న విషయం తెలిసిందే.

Show comments