Site icon NTV Telugu

IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్‌.. సంజూ ఆన్ డ్యూటీ!

Ind Vs Zim

Ind Vs Zim

IND vs ZIM: సూపర్ ఎయిట్స్ దశలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఓటమి అనంతరం భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా నేడు భారత్‌, జింబాబ్వేలు తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌, జింబాబ్వేల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేపట్టనుంది.

ViRosh Wedding: విజయ్-రష్మిక పెళ్లిలో ‘‘పంది కర్రీ’’ ఎందుకు ముఖ్యం.. ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.?

ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నాడు. టాస్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. జట్టు మంచి మూడ్‌లో ఉందని.. గత మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి ఈ మ్యాచ్‌లో ఆడాలని ఆటగాళ్లకు సూచించినట్లు వెల్లడించాడు. అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్య జట్టుకు కీలక పాత్ర పోషిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఆడియోతో Samsung Galaxy Buds4 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

భారత్ ప్లేయింగ్ XI:
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే ప్లేయింగ్ XI:
తాడివానషే మరుమాని (వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, రయాన్ బర్ల్, సికందర్ రాజా (కెప్టెన్), టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఇవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబాని, రిచర్డ్ నగరవా

Exit mobile version