IND vs USA: అదే మా కొంపముంచింది: ఆరోన్ జోన్స్
- 10-15 పరుగులు తక్కువ చేశాం
- తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం
- బౌలింగ్ యూనిట్ పట్ల గర్వపడుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaron Jones on USA Defeat vs IND: బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ తెలిపాడు. తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నానన్నాడు. మా తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం అని జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం అమెరికా తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ మాట్లాడుతూ… ‘మేం బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువగా చేశాం. 130 పరుగులు చేసుంటే.. కఠిన లక్ష్యంగా ఉండేది. ఆటలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు రావడం సాధారణమే. మా ప్లేయర్స్ చాలా క్రమ శిక్షణతో ఆడారు. ముఖ్యంగా మా బౌలింగ్ యూనిట్ పట్ల గర్వపడుతున్నా. మా ఆటగాళ్ల ప్రదర్శనతో సంతోషంగా ఉంది. మేము కోరుకున్నది ఇదే. యూఎస్ఏ క్రికెట్‌ను ఆస్వాదిస్తోంది. మా ఓటమిపై సమీక్షించుకుంటాం. మా తప్పిదాలను తెలుసుకొని బలంగా తిరిగి వస్తాము’ అని అన్నాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs USA: ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ గెలిచాం: రోహిత్
‘ఈ వికెట్ చాలా కష్టంగా ఉంది. సీమ్ బౌలింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. అందుకే స్పిన్నర్లతో బౌలింగ్ చేయంచలేదు. మా కెప్టెన్ మోనాంక్ పటేల్ చివరి మ్యాచ్‌కు అదుబాటులోకి వస్తాడు. అతనికి చిన్న గాయమే అయింది’ అని ఆరోన్ జోన్స్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్స్ కొల్పోయి 111 పరుగులు చేసి గెలుపొందింది.
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!