Site icon NTV Telugu

NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!

Teamindia

Teamindia

NED vs IND Playing XI: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తో నేడు (ఫిబ్రవరి 18) ఆడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. అమెరికా, నమీబియా, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి అన్ బిటెన్ రికార్డ్‌తో సూపర్ 8 లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్

పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 180-200 పరుగుల స్కోర్ చేసే అవకాశముంది. డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కొంత సులభం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం భారత్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీం విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వీరితోపాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ అల్ రౌండర్స్ రూపంలో జట్టుకు సమతుల్యతను అందిస్తున్నారు. ఇకపోతే నేడు పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఓపెనింగ్‌లో ‘అభిషేక్ శర్మ’కు మరో అవకాశం దక్కే అవకాశముంది. ఇప్పటి వరకు టోర్నమెంట్ లో రెండు సార్లు ఆది.. రెండు సార్లు డక్ అయినప్పటికీ టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. మరోవైపు నమీబియాపై మ్యాచ్‌లో సంజు శాంసన్ వేగంగా 22 పరుగులు చేసినా అతనిపై జట్టు ఆశలు పెట్టుకోలేదు. మరోవైపు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన నెదర్లాండ్స్ జట్టులో కూడా మ్యాచ్‌లో కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.

OnePlus 15 vs iQOO 15 vs Realme GT 8 Pro Comparison: మూడు ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ రివ్యూ.. బెస్ట్ మొబైల్ ఏదంటే?

ప్లేయింగ్ XI అంచనా:
భారత్:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (W), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

నెదర్లాండ్స్:
మైఖేల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కొలిన్ అకర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, జాక్ లయన్-కాచెట్, రూలాఫ్ వాన్ డర్ మెర్వే, లోగన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్.

Exit mobile version