IND vs AFG: గతం గురించి ఎందుకు.. నేను ఇప్పుడు ప్లేయర్ కాదు: రాహుల్ ద్రవిడ్
- సూపర్-8లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా
- రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్
- నేను ఇప్పుడు ప్లేయర్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid React on India’s 1997 Test Defeat vs West Indies: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ సూపర్-8 పోరుకు సిద్ధమైంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గతం గురించి ఎందుకని, తాను ఇప్పుడు ప్లేయర్ కాదని గట్టిగా సమాధానం ఇచ్చాడు.
ఆటగాడిగా విండీస్‌లో మీకు గొప్ప గణాంకాలు లేవు, ఇప్పుడు ఏం చేస్తారు? అని రాహుల్ ద్రవిడ్‌ను అడగ్గా.. ‘ఎప్పుడో జరిగిన వాటి నుంచి త్వరగా బయటకొస్తా. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోను. ఇప్పుడు ఏం చేయాలి? అనే దానిపైనే దృష్టిపెడతా. 1997లో జరిగిన దాని గురించి నాకు ఆందోళన లేదు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో విజయం సాధించి ఉంటే.. వేరేరకంగా మాట్లాడేవారు. టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు మా ప్లేయర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు నేను ప్లేయర్‌గా ఇక్కడకు రాలేదు. కాబట్టి పాత వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని బదులిచ్చాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
రాహుల్ ద్రవిడ్ 1997లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడాడు. నేడు మ్యాచ్ జరిగే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ మైదానంలోనే అప్పుడు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో ద్రవిడ్ 78, 2 పరుగులు చేసినా.. టీమిండియా మాత్రం ఓడిపోయింది. అదే విషయాన్ని సదరు రిపోర్టర్ అడగ్గా.. ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ది వాల్ ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌తో అతడి పదవీకాలం ముగుస్తుంది.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!