T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!

  • కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం
  • కివీస్ పై ఇంగ్లాండ్ విజయం..
  • సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్..
T20 World Cup 2026

T20 World Cup 2026

ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్‌తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్‌పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు.

Hercules C-130 Crash: రోడ్డుపై కూలిన వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం.. 12 మంది మృతి

కివీస్ ఇన్నింగ్స్ ను టిమ్ సీఫెర్ట్ (35), ఫిన్ అలెన్ (29) వేగంగా ఆరంభించినా.. మధ్య ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్ల దాడికి తట్టుకోలేక పోయారు ఇంగ్లాండ్ బ్యాటర్స్. గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో పోరాడినా ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ త్రయం మ్యాచ్ మోమెంటమ్‌ను మార్చింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

అయితే.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26), జాకబ్ బెథెల్ (21) కాస్త రాణించినా.. కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 3/19 గణాంకాలతో మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 117/6 దశలో ఉండగా, చివరి మూడు ఓవర్లకు 43 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్ (32*), రెహాన్ అహ్మద్ (19*) మెరుపు దాడితో 18వ ఓవర్‌ లోనే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశారు. దీనితో కేవలం 19.3 ఓవర్లలో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకుని గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత సంచలనం

ఈ ఫలితంతో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో నిలిచిపోగా.. పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ ఫలితం కీలకమైంది. న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ 1.39గా ఉండగా పాకిస్తాన్ -0.461తో ఉండటంతో వారికి భారీ విజయం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.