Site icon NTV Telugu

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!

T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఈ పరిస్థితిలో జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్ జట్టు స్కోర్ బాధ్యతను తీసుకున్నారు.

India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!

వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీ20 చరిత్రలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ మాత్రమే కాదు.. మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల చరిత్రలో ఇదే అత్యధిక 8వ వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు రూబెన్ ట్రంప్ ఎల్మన్, డేవిడ్ విఎస్ పేరిట ఉండేది. వీరు 2022లో UAEపై 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పుడు హోల్డర్–షెపర్డ్ జోడీ ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది.

Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!

ఈ ఇద్దరి అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. హోల్డర్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి కీలక పాత్ర పోషించగా, షెపర్డ్ 37 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. హోల్డర్–షెపర్డ్ జోడీ నమోదు చేసిన 89 పరుగుల భాగస్వామ్యం, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 8వ వికెట్ లేదా అంతకంటే దిగువ స్థానంలో రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. ఈ విభాగంలో బెల్జియంకు చెందిన సాబేర్ జాఖిల్, శాఖ్లైన్ అలీ 2021లో ఆస్ట్రియాపై 132 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.

Exit mobile version