TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
- విజయ్‌కు కొత్త చిక్కులు
- వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
- లెఫ్ట్ పార్టీల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే అతి పెద్ద పార్టీగా అవరించినా.. ప్రమాణస్వీకారానికి గవర్నర్ అడ్డుకట్ట వేశారు. పూర్తి మెజారిటీతో రావాలని తేల్చి చెప్పారు. దీంతో తమిళనాడు రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠగా మారాయి.
అయితే రాజకీయ అనిశ్చితి నెలకున్న తరుణంలో టీవీకే విజయ్‌కు కొత్త చిక్కులు వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు విజయ్ చిన్న చిన్న పార్టీలను కలుపుకునిపోతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు తెల్పగా.. వామపక్షాలు, సీవీకే పార్టీలు మద్దతిస్తే.. మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది. ఇలాంటి తరుణంలో విజయ్ ఆ పార్టీలను నేరుగా కలిసి మద్దతు కోరితే.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా మెత్తబడతారు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో వామపక్షాలు గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
వామపక్షాల మద్దతు కోరే క్రమంలో విజయ్ ఆయా పార్టీలకు వాట్సాప్ మెసేజ్‌లు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. టీవీకే పార్టీ సీపీఐ, సీపీఎం, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీల మద్దతు కోరుతూ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా విజయ్ సంప్రదించినట్లుగా సమాచారం. అయితే ఈ విధానంపై ఆ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదేం పద్ధతి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీ.. ఇలానేనా? సంప్రదించాల్సిన పద్ధతి అంటూ నిలదీస్తున్నట్లుగా సమాచారం. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు.. ఇలాంటి సమయంలో పార్టీలను ప్రత్యక్షంగా కలవకుండా.. కార్యాలయానికి రాకుండా వాట్సాప్ మెసేజ్‌లతో సంప్రదించడమేంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఓ వామపక్ష నేత జాతీయ మీడియాతో వాపోయాడు. వాట్సాప్ ద్వారా మద్దతు కోరడం వామపక్ష నేతలకు ఏ మాత్రం నచ్చలేదని వ్యాఖ్యానించారు.
సెటైర్…
‘‘తమిళనాడులో కూటమి రాజకీయాలు అంటే ప్రత్యక్ష చర్చలు.. పరస్పర గౌరవం, సిద్ధాంత పరమైన స్పష్టత, షరతులపై పారదర్శకత ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది ‘జెన్-జీ కూటమి రాజకీయాలు’లా కనిపిస్తోంది” అని మరో వామపక్ష నేత సెటైర్ వేసినట్లు కథనం పేర్కొంది.
ఇక డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడంపైనా వామపక్షాల్లో అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. “కాంగ్రెస్ ఒక్క ఫోన్ కాల్‌తో డీఎంకే నుంచి విడిచిపోయింది. ఇప్పుడు టీవీకే వామపక్ష కూటమినీ విరగదీయాలనుకుంటుందా?” అని మరో నేత వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే రాజకీయ అసంతృప్తి ఉన్నప్పటికీ.. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రభుత్వ ఏర్పాటుకు మొదటి అవకాశం విజయ్‌కే ఇవ్వాలని సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు బహిరంగంగా చెబుతున్నాయి. అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతున్నాయి.
డీఎంకే స్టాండ్ ఇదే..
ఇక డీఎంకే కూడా తన వైఖరిని కొంత సడలించినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలను కనీసం ఆరు నెలల పాటు అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా టీవీకే విఫలమైతే డీఎంకే-అన్నాడీఎంకే మధ్య అవగాహన కుదిరే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరు పార్టీలు ఖండించాయి. మరోవైపు తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌కు తరలించింది.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. వామపక్షాలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఆ పార్టీల దగ్గర 6 సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి విజయ్ నేరుగా చిన్న పార్టీల నేతలను కలిస్తే.. మార్గం సుగమం అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకే నేతలు నేరుగా కలిసి మద్దతు కోరగా.. రేపు చెబుతామని చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?