Bangladesh Cricket: T20 వరల్డ్ కప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్..
- టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బంగ్లాదేశ్..
- భారత్‌కు తమ జట్టును పంపేది లేదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Boycott T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ (జనవరి 22న) జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది. కాగా, నిన్న (జనవరి 21న) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించగా, టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Read Also: Harish Rao: “మాకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఇదే”.. సిట్ నోటీసులపై హరీష్‌రావు ఫైర్
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక, ఈ అంశంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ మాట్లాడుతూ.. మేం వరల్డ్‌కప్ ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ భారత్‌లో మాత్రం ఆడబోం.. ఈ విషయంపై ఐసీసీతో మా చర్చలు కొనసాగుతాయి.. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.. ముస్తాఫిజుర్ అంశం ఒక్కటే కాదు.. ఆ విషయంలో భారతే పూర్తిగా నిర్ణయాధికారం చేపట్టింది అని అన్నారు. అలాగే, మా మ్యాచ్‌లను భారత్ బయట నిర్వహించాలన్న మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.. ప్రపంచ క్రికెట్ పరిస్థితి ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు బుల్బుల్ పేర్కొన్నారు.
Read Also: Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..
అయితే, ప్రపంచవ్యాప్తంగా భారత్- ఐసీసీ నిర్ణయాలతో క్రికెట్ పై ప్రజాదరణ తగ్గుతోంది అని బంగ్లాదేశ్ తెలిపింది. సుమారు 200 మిలియన్ల మందిని ఆటకు దూరం చేస్తున్నారు.. క్రికెట్ ఒలింపిక్స్‌లోకి వస్తోంది.. కానీ మాలాంటి దేశం పాల్గొనలేక పోతే, అది ఐసీసీ వైఫల్యమే అని బుల్బుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో.. ఐసీసీ తదుపరి చర్యలు ఏంటీ అన్నది ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
-
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!