Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్‌దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!

Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh: టీమిండియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌ లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్‌ ను కుదేలు చేశాడు. సికందర్ రాజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా వికెట్లు పడగొట్టి భారత్‌కు 72 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

ఈ మూడు వికెట్లతో అర్ష్‌దీప్ రికార్డును అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా తరుఫున ఇప్పటి వరకు 35 వికెట్లను పడగొట్టాడు. దీనితో టీ20 వరల్డ్ కప్‌ లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 33 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 32 వికెట్లతో ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య 29, రవీంద్ర జడేజా 22 వికెట్లతో ఉన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అర్ష్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి జట్టుకు కీలక సహకారం అందిస్తున్నాడు. అయితే ఈ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 47 పరుగులు, జింబాబ్వేపై 35 పరుగులు ఇవ్వడంతో ఆందోళన కలిగిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

జీరో డౌన్ పేమెంట్‌, వడ్డీ లేని ఈఎంఐలతో Reno Series & Find X9 series స్మార్ట్ ఫోన్స్.!

వెస్టిండీస్–దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి హోటల్ గదిలో చూస్తున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్ భారత్‌కు కీలకం కావడంతో, వెస్ట్ ఇండీస్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఉండేది. “వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టినప్పుడల్లా నా నాన్న కోపంగా అరవడం మొదలుపెట్టారు.. ‘ఏం చేస్తున్నారు?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన్ను శాంతింపజేసి, క్రికెట్‌ను ఆస్వాదించమని చెప్పాను. భారత్‌కు నెక్స్ట్ మ్యాచ్ కోల్‌కతా వేదికగా వెస్టిండీస్ తో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశముండటంతో రెండు టీమ్స్ కు ‘డూ ఆర్ డై’ గా మారింది.