T20 World Cup 2024: అతడి కంటే బాగా ఎవరు ఆడగలరు.. బీసీసీపై అంబటి రాయుడు ఆగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu Supports Rinku Singh: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. గతేడాదిగా భారత టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అద్భుత ప్రదర్శన చేస్తున్న రింకూను బీసీసీఐ సెలెక్టర్లు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు. రింకూకు 15 మంది జట్టులో చోటివ్వకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు బీసీసీ సెలెక్టర్లపై మండిపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు కూడా బీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రింకు సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయకపోవడం చూస్తుంటే.. క్రికెటింగ్ సెన్స్ కంటే గణంకాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం అయిందని అంబటి రాయుడు అన్నాడు. 16, 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో భారత జట్టులో ఎవరు బ్యాటింగ్ చేస్తారని ప్రశ్నించాడు. ‘రింకూ సింగ్‌ను తప్పించడం చూస్తే.. క్రికెట్ సెన్స్‌పై గణాంకాలదే ఆధిపత్యం అని అర్ధమవుతోంది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా తప్ప.. ఎవరూ కూడా రింకూలా 16, 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయలేదు. రింకూను టీమిండియా చాలా మిస్ అవుతుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఇన్‌స్టాగ్రామ్ లైక్స్ కంటే క్రికెటింగ్ సామర్థ్యం ముఖ్యం’ అని రాయుడు ట్వీట్ చేశాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024 ప్రదర్శనే రింకూ సింగ్‌ను పక్కనపెట్టడానికి కారణం అని తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలలే రింకూను పక్కనపెట్టడానికి కారణం. మరోవైపు శివమ్ దూబే విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా రింకూ ఎంపికకు ఆడ్డుపడ్డాయనే చెప్పాలి. దూబే బౌలింగ్ కూడా చేస్తాడన్న విషయం తెలిసిందే.
Rinku Singh’s omission clearly indicates stats rule over cricketing sense.. who in this selected Indian has been walking out in the 16 th and 17 th over in a t20 game in the last 2 years and playing fluently with a high strike rate and can win a game except Ravindra Jadeja.. he…
— ATR (@RayuduAmbati) May 1, 2024
- Tags
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?