T20 World Cup: బాయ్‌కాట్ నిర్ణయంపై పాక్ టీం యూటర్న్..?
- కొనసాగుతున్న టీ20 వరల్డ్ కప్ వివాదం..
- భారత్ మ్యా్చ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్..?
- శ్రీలంక రిక్వెస్ట్‌ను పాకిస్తాన్ పరిగణించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్‌లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్‌తో తాము మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే, టోర్నీ మొత్తాన్ని కాకుండా, కేవలం ఒక జట్టుతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్తాన్ ఐసీసీ తీవ్ర చర్యలకు గురికావాల్సి వస్తుంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్రమై ఆర్థిక నష్టమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు దాయాది జట్టు తన బాయ్‌కాట్ నిర్ణయంపై ‘‘యూటర్న్’’ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పీసీబీ మరోసారి సమీక్షించాలనుకుంటోంది. బాయ్‌కాట్ నిర్ణయాన్ని మార్చుకోవాలని శ్రీలంక, పాకిస్తాన్‌ను కోరింది. ఈ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, టోర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింటున్నది పేర్కొంది. ఈ మేరకు పీసీబీకి శ్రీలంక బోర్డు ఈమెయిల్ కూడా పంపించింది.
Also Read
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
దీంతో బాయ్‌కాట్ నిర్ణయంపై పాక్ క్రికెట్ బోర్డు తన ప్రభుత్వాన్ని సంప్రదించింది. పాక్ ప్రభుత్వానికి, శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ స్థాయిలో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. గతంలో పాక్ పర్యటనలో ఉన్న సమయంలోనే శ్రీలంక టీమ్‌పై దాడి కూడా జరిగింది. దీంతో శ్రీలంక అభ్యర్థన విస్మరించలేమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
“శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా నేరుగా మొహ్సిన్ నఖ్వీని సంప్రదించి, ఈ సమయంలో శ్రీలంకకు పాకిస్థాన్ మద్దతు అవసరమని గుర్తు చేశారు. ఎందుకంటే పాకిస్థాన్,భారతదేశం మ్యాచ్‌లు లేకపోతే, శ్రీలంక బోర్డు గేట్ మనీ, హాస్పిటాలిటీ రంగాలపై మొదలైన వాటి నుండి అదనపు ఆదాయాన్ని కోల్పోతుంది,” అని చెప్పినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ , పాక్ ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారని చెప్పారు.
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!