Site icon NTV Telugu

T20 World Cup 2026: బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

Wasim Akram Pcb

Wasim Akram Pcb

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లా ఆడకపోతే.. పాకిస్థాన్ కూడా బహిష్కరిస్తుంది అనే పీసీబీ ఆలోచనపై అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ఆలోచనలు పాకిస్థాన్ క్రికెట్‌కు మేలు చేయవని స్పష్టం చేశారు. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దాయాదుల మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో షెడ్యూల్ అయి ఉంది.

‘బంగ్లాదేశ్ ఆడకపోతే పాకిస్థాన్ ఎందుకు టీ20 వరల్డ్‌కప్‌ 2026ను బహిష్కరించాలి?. అసలు పాకిస్థాన్ క్రికెట్‌కు బంగ్లాదేశ్ ఏం చేసింది?. ఇందులో నాకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు. ఇతర దేశాల నిర్ణయాలపై ఆధారపడి పీసీబీ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’ అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది రాజకీయాలు, వివాదాలపై కాదని.. ఆటపై మాత్రమేనని అని అన్నారు. ‘పాకిస్థాన్ క్రికెట్ ముందుగా తన సమస్యలపై దృష్టి పెట్టాలి. జట్టు ఆటను మెరుగుపర్చుకోవాలి. వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని అక్రమ్ సూచించారు.

Also Read: Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్‌ ఇండియా స్టార్మ్ పక్కా!

వసీం అక్రమ్ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఓ మంచి సందేశం అనే చెప్పాలి. వివాదాల్ని పక్కనపెట్టి.. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు సమతుల్యతపై ఫోకస్ చేస్తేనే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తిరిగి బలమైన జట్టుగా నిలుస్తుందని అక్రమ్ చెప్పుకొచ్చారు. అక్రమ్ వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు. మరో 2 రోజుల్లో ఐసీసీ సమావేశం జరిగే అవకాశముంది. ఆ భేటీలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పాకిస్థాన్‌ను సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Exit mobile version