T20 World Cup 2026: బహిష్కరణకు అవకాశమే లేదు.. పాకిస్థాన్ తప్పక టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందే!
- టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ
- బంగ్లాదేశ్‌కు మద్దతు ఇవ్వాలని చూస్తున్న పాకిస్థాన్
- టోర్నీ నుంచి వైదొలుగుతామని పాక్ కామెంట్స్
- బహిష్కరణకు అవకాశం పాకిస్థాన్‌కు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రత కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్‌కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై శుక్రవారం తుది నిర్ణయం ప్రకటిస్తామని పీసీబీ స్పష్టం చేసింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను బహిష్కరించే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొనడంపై ఎలాంటి ఒప్పంద ఉల్లంఘన జరిగినా.. పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం. ఐసీసీతో కుదుర్చుకున్న పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తే.. పాకిస్థాన్‌పై అంతర్జాతీయ టోర్నీల నుంచి నిషేధం విధించే అవకాశముంది. అంతేకాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్ల పాల్గొనడంపై కూడా ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని ఐసీసీ నుంచి పీసీబీకి హెచ్చరికలు అందాయి.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
Also Read: Pileru Forest Case: పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ముందడుగు వేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఆంక్షలు విదిస్తే.. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనడమే ఇప్పుడు పాక్ జట్టుకు ఉన్న ఏకైక ఆప్షన్. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ 2026 బహిష్కరణకు దాయాది జట్టుకు అవకాశమే లేదు. పీసీబీ కూడా టోర్నీలో ఆడాలనే నిర్ణయంను ఐసీసీకి తెలియజేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం పీసీబీ తీసుకునే నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్‌కు కీలక మలుపుగా మారనుంది.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?