Nepal T20 World Cup Squad: ఐపీఎల్ స్టార్‌కు చోటు.. టీ20 వరల్డ్ కప్‌కు నేపాల్ జట్టు ఇదే!
- భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2026
- మెగా టోర్నీలో ఆడనున్న నేపాల్ జట్టు
- ఐపీఎల్ స్టార్‌కు నేపాల్ జట్టులో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. 2025 ఆసియా కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన పసికూన నేపాల్.. మెగా టోర్నీలో ఆడనుంది. వరల్డ్ కప్ కోసం నేపాల్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మెగా టోర్నీలో ఆల్‌రౌండర్ రోహిత్ పౌడెల్ నేపాల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మరో ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్ సందీప్ లామిచానే నేపాల్ జట్టులో ఉన్నాడు.
25 ఏళ్ల సందీప్ లామిచానే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరపున తొమ్మిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. నేపాలీ జట్టు విజయాల్లో సందీప్ కీలక పాత్ర పోషించనున్నాడు. గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, సోంపాల్ కామి వంటి స్టార్లు కూడా జట్టులో ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో కుశాల్ భుర్టెల్ దూకుడు బ్యాటింగ్ నేపాల్‌కు కలిసిరానుంది. ఆసిఫ్ షేక్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో లోకేష్ బామ్ జట్టును ఆదుకోనున్నాడు. సందీప్ జోరా, ఆరిఫ్ షేక్‌లతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.
Also Read
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కు సోంపాల్ కామి, కరణ్ కెసి నాయకత్వం వహిస్తారు. ఇద్దరూ కొత్త బంతిని స్వింగ్ చేయగలరు. నందన్ యాదవ్, షేర్ మల్లా పేస్ బౌలింగ్ కోటాలో ఎంపికయ్యారు. 2024 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ నిరాశపరిచింది. నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాలీ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం… నేపాలీ జట్టు తన నాలుగు లీగ్ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. ఫిబ్రవరి 8న ఇంగ్లాండ్‌తో నేపాల్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
నేపాల్ జట్టు:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఎయిరీ (వైస్ కెప్టెన్), సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహ్మద్, కరణ్ యాడ్‌వ్ సి, సోంపాల్, సి. రాజబన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.
నేపాల్ గ్రూప్ మ్యాచ్ షెడ్యూల్:
ఫిబ్రవరి 08, vs ఇంగ్లాండ్, ముంబై
ఫిబ్రవరి 12, vs ఇటలీ, ముంబై
ఫిబ్రవరి 15, vs వెస్టిండీస్, ముంబై
ఫిబ్రవరి 17, vs బంగ్లాదేశ్, ముంబై
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!