IPL 2022 సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని T20 ప్రపంచకప్ లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌కు తాగాజా జరిగిన IPLప్రదర్శన ఆధారంగా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసాడు. అయితే ఈ జట్టులో రోహిత్ ,కోహ్లీ కి అవకాశం దక్కలేదు.
అయితే తన జట్టు ఓపెనర్లుగా KL రాహుల్, ఇషాన్ కిషన్ లను ఎంపిక చేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందనే ఈ జోడీకి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటిన రాహుల్ త్రిపాఠిని ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా ఎంపిక చేయగా సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో తీసుకున్నాడు.
IPL 2022 సీజన్‌లో తనదైన వ్యూహాలతో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తన T20 వరల్డ్ కప్ జట్టుకు ఆకాశ్ చోప్రా కెప్టెన్ గా ఎంపిక చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఈ ఆల్‌రౌండర్‌ను టీమిండియాను నడిపించగలడని చెప్పాడు. ఇక RCB తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన దినేష్ కార్తీక్ ను వికెట్ కీపర్‌గా తీసుకున్నాడు. అయితే షాక్ అయ్యే విషయం ఏంటంటే స్పిన్ ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యాను తీసుకున్నాడు.
ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన T20 ప్రపంచకప్ భారత జట్టు:
KL రాహుల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(Wk) , కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా