Site icon NTV Telugu

Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..

Sunny

Sunny

Virat Kohli: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్‌ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు ఉన్న విరాట్ సున్నాకే అవుట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌ వన్డేలో కోహ్లీ అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇవ్వడం.. ఇందుకు ప్రతిగా కోహ్లీ సైతం గ్లోవ్స్‌ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా స్టేడియాన్ని వీడాడు. కానీ, విరాట్ చర్య రిటైర్మెంట్‌కు సంకేతమనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం

ఇక, ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్‌ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్‌ ఆడినా మనం ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే, నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్‌ కోహ్లీకి ఫేవరెట్‌ స్టేడియం అని చెప్పాలి. అక్కడ సెంచరీలు బాదిన చరిత్ర అతడికి మాత్రమే ఉంది. కాబట్టి, సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ జీర్ణించుకోలేకపోయారని తెలిపాడు. అయినా ఓ ప్లేయర్ కెరీర్‌లో ఇలాంటివి జరగటం కామన్ అన్నారు.

Read Also: Car Parking Clash: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. రెండు మతాల మధ్య ఘర్షణ

అయితే, ఏదేమైనా విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడుతున్న వేళ ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందన అమోఘం అని సునీల్ గావస్కర్ పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు.. వాళ్లందరూ భారతీయ అభిమానులతో కలిసి కోహ్లీకి ఓవియేషన్‌ ఇవ్వడం గొప్ప ఆటగాడికి లభించే ఆదరణ అన్నారు. ఇదేమీ కోహ్లీ కెరీర్‌కు ముగింపు కాదని తెలిపారు. ఇక, విరాట్‌.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొడు.. రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం లేదన్నారు. సిడ్నీ మ్యాచ్‌ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌ జరగనుంది.. రోహిత్‌ శర్మతో కలిసి విరాట్‌ వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడతాడని నేను భావిస్తున్నా అని గావసర్క్ వెల్లడించారు.

Exit mobile version