Virat Kohli: విరాట్ సింహా కోహ్లీ.. చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Star Sports Telugu Repalced Veera Simha Reddy Poster With Virat Kohli: చివరివరకూ వీరోచితంగా పోరాడి, పాకిస్తాన్‌పై భారత్‌ను గెలిపించడంతో.. విరాట్ కోహ్లీకి సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. భారతీయ అభిమానులు, మాజీలు, ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇన్నాళ్లూ ఫామ్‌లో లేడని పెదవి విరిచిన వాళ్లు.. ఈరోజు కోహ్లీకి జేజేలు కొడుతున్నారు. ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో.. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ కింగ్‌లా కూర్చీపై కూర్చున్న ఒక ఫోటోతో అతనికి సలాం కొట్టింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా.. కోహ్లీ ఫామ్‌ని మెచ్చుకున్నాడు. ఫామ్ కన్నా క్లాస్ శాశ్వతమని తన ప్రదర్శనతో కోహ్లీ నిరూపించాడని, విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చాడని కొనియాడాడు.
ఇక ‘స్టార్ స్పోర్ట్స్ తెలుగు’ అయితే.. అందరి కంటే భిన్నంగా కోహ్లీని ప్రశంసించింది. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి పోస్టర్‌ని ఎడిట్ చేసి.. బాలయ్య స్థానంలో కోహ్లీని పెట్టి.. కిలోమీటర్ రాయి మీద ‘కింగ్’ క్యాప్షన్‌తో పాటు అతడు పాకిస్తాన్‌పై చేసిన స్కోర్‌ని మెన్షన్ చేసింది. అంతేకాదు.. టైటిల్‌కి తగినట్టుగా విరాట్ కోహ్లీ పేరుని విరాట్ సింహా కోహ్లీగా మార్చి, ‘‘చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు’’ అనే క్యాప్షన్ పెట్టింది. చూడ్డానికి వారెవ్వా అనిపించేలా ఉన్న పోస్టర్‌ని స్టార్ స్పోర్ట్స్ తెలుగు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడమే ఆలస్యం.. వెంటనే వైరల్ అయ్యింది. సరైన సమయంలో పర్ఫెక్ట్ ఎడిట్‌తో పెట్టారని ఫ్యాన్స్ కొనియాడుతూ.. ఆ పోస్టర్‌ని తెగ షేర్ చేస్తున్నారు.
Also Read
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో.. భారత్ సునాయాసంగా దీన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, వెనువెంటనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఇక గెలవడం దాదాపు కష్టమేనని అనుకుంటున్న తరుణంలో.. హార్దిక్ పాండ్యా సహకారంతో విరాట్ కోహ్లీ విజృంభించాడు. క్రీజులో చివరివరకూ నిలబడి, భారత జట్టుని అపురూపమైన విజయాన్ని అందించాడు.
"చేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటా లోనే లేదు!" – విరాట్ సింహ కోహ్లీ! 😎👊🏻#ViratKohli #KingKohli #NBK107 #VeeraSimhaReddy #JaiBalayya #TeamIndia #IndianCricketTeam#BelieveInBlue 💙 pic.twitter.com/3CxUTWk5tl
— StarSportsTelugu (@StarSportsTel) October 23, 2022
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!