SRH : సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ దుమ్ములేపింది. భారీ స్కోర్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే రేపు ఐదో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్లేయర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్లు నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి వచ్చారు. ఈ రోజు ఉదయమే వచ్చిన వీరిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. మ్యాచ్ లో గెలిపించాలని మొక్కుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : DC vs CSK : చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కు రంగం సిద్ధం… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.
వీరికి ఆలయ నిర్వాహకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. వారితో ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు క్రికెటర్స్ ను చూసి షాక్ అయ్యారు. వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేపు ఉప్పల్ వేదికగా గుజరాత్, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్ల నడుమ పోటీ జరగబోతోంది. గుజరాత్ మూడు మ్యాచ్ లు ఆడి ఒకటి మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్లు వరుస ఓటములతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి.