Rotary Club of Vijayawada Honored K Raghavendra Rao With Lifetime Achievement Award: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు అరుదైన గౌరవం దక్కింది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆయన్ను లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్‌తో పురస్కరించింది. వేదిక ఫంక్షన్ హాల్లో అతిథులు, ఆహ్వానితుల సమక్షంలో.. రోటరీ క్లబ్ ప్రతినిధులు ఆయన్ను సన్మానించి, ఆ అవార్డ్‌ని అందచేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. విజయవాడ నగరం కళలకు కాణాచిగా ప్రసిద్ధి అని పేర్కొన్నారు. తాను విజయవాడలోనే పుట్టానని, ఇక్కడ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ పుట్టిన నేలపై అవార్డు అందుకోవడం మరచిపోలేనన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.
Parampara : భోజన ప్రియులకు శుభవార్త.. అబిడ్స్‌లో ప్రముఖ రెస్టారెంట్ ‘పరంపర’
ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త తరం దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారని, వాళ్ల దగ్గరకి వెళ్లి కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నానని రాఘవేంద్ర రావు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ సినిమాలకు దర్శకత్వం వహించడం లేదని స్పష్టతనిచ్చారు. కొత్తగా కెఆర్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టానన్న ఆయన.. దీని ద్వారా కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి.. వారితో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశామని తెలియజేశారు. చాలా మంది ఇక్కడ పని చేసెందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. కేవలం భారతదేశమే కాదు.. మొత్తం ప్రపంచం మనవైపు చూసేలా ఆర్ఆర్ఆర్ టీమ్ కృషి చేసిందని, అందుకు వాళ్లకి హ్యాట్సాఫ్ అని కొనియాడారు. శాంతి నివాసం ద్వారా రాజమౌళి తన కెరీర్ ప్రారంభించారని, స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నేటి వరకు ఆయన హార్డ్‌వర్‌నే నమ్ముకున్నారని అన్నారు. మనకి ఆస్కార్ రావడంలో భాగస్వామ్యమైన అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని దర్శకేంద్రుడు చెప్పుకొచ్చారు.
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన జరీన్.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం