40 కిలోమీటర్ల పరుగు పందాన్ని మారథాన్ అంటారు. అంతదూరం పరుగులు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది… గడ్డగట్టే చలిలో పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. మైనస్ 53 డిగ్రీల చలిలో పరుగులు తీయాలి అంటే ఆషామాషీ కాదు. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. శరీరం గడ్డకట్టుకుపోతుంది. శరీరంపై మంచు దుప్పటిలా కప్పేస్తుంది. అయినప్పటికీ ఇలాంటి మారథాన్ పరుగు పందాల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారు. ఇటీవలే ఇలాంటి పరుగుపందెం ఒకటి రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఓమ్యకోన్ లో జరిగింది. మైనస్ 53 డిగ్రీల చలిలో 42.12 కిలోమీటర్ల మేర ఈ పరుగుపందెం నిర్వహించారు.
Read: Mahindra: నిరుద్యోగులకు మహీంద్రా బంపర్ ఆఫర్..
రష్యా, యూఏఈ, బెలారస్‌కు చెందిన క్రీడాకారులు 62 మంది ఈ పరుగుపందెంలో పాల్గొన్నారు. మైనస్ 53 డిగ్రీల చలిలో జరిగిన ఈ మారథాన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో డెస్టినేషన్ చేరుకోగా, మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరినా విజయం సాధించారు.