40 కిలోమీటర్ల పరుగు పందాన్ని మారథాన్ అంటారు. అంతదూరం పరుగులు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది… గడ్డగట్టే చలిలో పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. మైనస్ 53 డిగ్రీల చలిలో పరుగులు తీయాలి అంటే ఆషామాషీ కాదు. బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. శరీరం గడ్డకట్టుకుపోతుంది. శరీరంపై మంచు దుప్పటిలా కప్పేస్తుంది. అయినప్పటికీ ఇలాంటి మారథాన్ పరుగు పందాల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పోటీ పడుతుంటారు. ఇటీవలే ఇలాంటి పరుగుపందెం ఒకటి రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని…