Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
- అఫ్గానిస్థాన్ టెస్ట్ మ్యాచ్‌లో గిల్ సెంచరీ
- శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనత
- భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Captain Record: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన గిల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన రికార్డును అందుకున్నాడు. రెండో రోజు 126 పరుగులతో మెరిసిన గిల్.. టెస్ట్ కెప్టెన్‌గా తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడాగిల్ దాటాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101 మంది నాయకుల్లో శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా 82.76 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఈ జాబితాలో అతని కంటే ముందున్న ఏకైక ఆటగాడు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే. బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా 101.51 సగటును నమోదు చేశాడు. ఆశ్చర్యకరంగా టెస్ట్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్ కూడా 70కి పైగా సగటును కొనసాగించలేకపోయాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న లంక దిగ్గజ కెప్టెన్ కుమార సంగక్కర సగటు 69.6 మాత్రమే.
Also Read
- Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
- Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
- Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
అంతేకాదు భారత టెస్ట్ కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ముందున్నారు. గవాస్కర్ ఈ మైలురాయిని 14 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు 368/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గిల్ 126 పరుగులు చేయగా, పంత్ 81 పరుగులతో రాణించాడు. సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు రాహుల్ 100, సాయి 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసింది. అరంగేట్రం చేస్తున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా.. ప్రసిద్ రెండు వికెట్లు సాధించాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ ఇంకా 451 పరుగుల వెనకంజలో ఉంది. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే మిగిలి ఉండటంతో మూడో రోజు తొలి సెషన్లోనే ఫాలోఆన్ విధించే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?