Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Reaction on India’s Big Win vs Afghanistan: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. గురువారం రాత్రి ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ సేన 127 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు చెలరేగడంతో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో అభిషేక్ శర్మ (108; 34 బంతుల్లో 9×4, 11×6), సంజు శాంసన్ (50; 35 బంతుల్లో 2×4, 4×6), నితీశ్ కుమార్ రెడ్డి (3/25), రవి బిష్ణోయ్ (3/26), అక్షర్ పటేల్ (2/9) కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఈ విజయంపై చాలా సంతోషంగా ఉన్నా. అయితే మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు. అఫ్గానిస్థాన్ తమ సొంత దేశంలో కాకుండా భారత్‌కు వచ్చి ఈ సిరీస్ ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు పోరాడిన తీరు అభినందనీయం. ఢిల్లీలో మాకు ఆతిథ్యం ఇస్తున్న జట్టుగా వారు పోరాడిన తీరును తప్పకుండా గౌరవించాలి. ఇది అంత సులభమైన వికెట్ కాదు. అయినప్పటికీ భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అతడు ఎక్కడా తడబడలేదు. కఠినమైన పిచ్‌పై కూడా అభిషేక్ అద్భుతమైన టైమింగ్‌తో బ్యాటింగ్ చేశాడు. సంజు శాంసన్ కూడా బాగా ఆడాడు. మంచి ఆరంభం ఇచ్చాడు’ అని శ్రేయాస్ చెప్పాడు.
Also Read
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
221 పరుగుల భారీ స్కోరు సాధించడంపై శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. ‘నిజం చెప్పాలంటే ఈరోజు నేను బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని ముందే అనుకున్నాను. అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో కొద్దిసేపు చర్చ జరిగింది. అతను మొదటి రెండు మ్యాచ్‌ల్లో కూడా బౌలింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకే ఈరోజు మేమే ముందుగా బ్యాటింగ్ చేస్తామని నేను ముందే ఊహించాను. మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కూడా వేగంగా పరుగులు సాధించాం. చివరికి 220 పరుగులు స్కోర్ బోర్డుపై ఉంచడం నిజంగా అభినందించదగ్గ విషయం. బ్యాటింగ్ యూనిట్ అద్భుతం’ అని సర్పంచ్ సాబ్ ప్రశంసించాడు.
‘ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్ అద్భుతం. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు జట్టుకు అండగా నిలుస్తాడు. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. ఆటపై అక్షర్ పూర్తి అవగాహనతో ఉంటాడు. తన ప్రదర్శన గురించి ఎంతో ఆలోచిస్తూ నిరంతరం మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాడు. ఎన్నో ఏళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్న అక్షర్‌కు అభినందనలు. నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్ బౌలింగ్ బాగుంది. వీరందరూ బాగా ఆడారు. వారి వల్లే ఈ భారీ విజయం సాధ్యమైంది. జట్టు ప్రదర్శనపై చాలా హ్యాపీగా ఉంది’ అని శ్రేయాస్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!