Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoriful Islam Record: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 38.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి.. బంగ్లాదేశ్ పతనంతో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రెండో టెస్టులో బంగ్లాదేశ్ దారుణంగా ఓడినా.. ఆ జట్టు స్టార్ పేసర్ షరీఫుల్ ఇస్లాం చరిత్ర సృష్టించాడు. మాకే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన షరీఫుల్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా షరీఫుల్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడం 140 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1886లో ఇంగ్లండ్‌కు చెందిన డిక్ బార్లో మాంచెస్టర్ టెస్టులో 7/44 గణాంకాలతో ఈ ఘనతను సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డును అందుకోలేదు.
Also Read
- Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది మాత్రం ఇంగ్లండ్ దిగ్గజం జిమ్ లేకర్. 1956 జూలైలో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ ఏకంగా 10 వికెట్లు తీసి 53 పరుగులిచ్చాడు. షరీఫుల్ ఇస్లాం అద్భుత స్పెల్‌తో బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగానికి అండగా నిలిచాడు. అయితే అతడు వ్యక్తిగతంగా చరిత్రాత్మక ప్రదర్శన చేసినప్పటికీ.. మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశపరిచింది. మరోవైపు ఈ సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ చరిత్ర సృష్టించింది. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానం కంటే పైకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ ఆరో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం బంగ్లా 78 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క