IND vs PAK: భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలి.. బీసీసీఐ, పీసీబీ ఏం చేయలేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Requests Pakistan Team To Take Revenge On India In ODI World Cup: ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశంపై కొంతకాలం నుంచి తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే! పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము అక్కడ అడుగు పెట్టబోమని జైషా పేర్కొంటే.. తాము కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు భారత్ గడ్డపై కాలు మోపమంటూ పాక్ బోర్డు సహా మాజీలు తిరుగు సమాధానాలిచ్చారు. అయితే.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే.. ఇవన్నీ కేవలం వట్టి మాటలు. బీసీసీఐ గానీ, పీసీబీ గానీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి లేకుండా పీసీబీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి.. భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో మాజీ క్రికెటర్లు ప్రతికూలంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. పాకిస్తాన్లో టీమిండియా పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు.
VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
- KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
- KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఇదే సమయంలో.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతే చూడాలని ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్తాన్ తలపడాలంతే. ఆ ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా, అహ్మదాబాద్లోనా అనే అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా.. టైటిల్ పోరు ఈ రెండు దేశాల మధ్యే జరగాలి’’ అని బలంగా కోరుకుంటున్నాడు. అంతేకాదు.. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి.. ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందాన్ని కోరాడు. కాగా.. 1983 వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్ సాధించింది. ఆ తర్వాత స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో.. ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పటి నుంచి భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. దీంతో.. ఈసారి జరగబోయే వరల్డ్‌కప్‌లో విజయం సాధించి, టైటిల్ నెగ్గాలని భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి, ఈసారి ఎవరు ట్రోఫీని ముద్దాడుతారో చూడాలి.
India: గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అట్టడగున భారత్.. ఉక్రెయిన్ కంటే దిగువనే.. ఎందుకిలా?
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!