Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
- క్రికెట్ ఆటలో ఫినిషర్ పాత్ర ఎంతో కీలకం
- టీ20 ఫార్మాట్లో ఫినిషర్ తప్పనిసరి
- దూబే.. ది టీమిండియా ఫినిషర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube The Finisher for Team India: క్రికెట్ ఆటలో ఫినిషర్ పాత్ర ఎంతో కీలకం. ఇన్నింగ్స్ చివరలో స్కోర్ బోర్డు పరుగెత్తాలన్నా, టీమ్ విజయం సాధించాలన్నా ఫినిషర్ తప్పనిసరి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో. గతంలో భారత టీ20 జట్టులో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు ఫినిషర్ పాత్ర పోషించారు. ఇప్పుడు రిషబ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో దూబే ఫినిషర్ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. గత 12 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో అతడు చూపించిన స్థిరత్వం, దూకుడు ఇప్పుడు టీమిండియాకు భారీ ప్లస్‌గా మారింది.
శివమ్ దూబే చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో ఫినిషర్‌గా రాణించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 10*(3), 10*(4), 9(4), 36*(18), 65(23), 7*(2), 0(1), 23(16), 27(17), 66(31), 42(37), 8*(4) రన్స్ చేశాడు. ఈ 12 ఇన్నింగ్స్‌లలో 303 పరుగులు చేసిన దూబే సగటు 43.28గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ 189.37 ఉండడం అతడి దూకుడును స్పష్టంగా చూపిస్తోంది. అవసరమైన సమయంలో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం అతనికి ఉంది. మధ్య ఓవర్లలో క్రీజులోకి వచ్చి మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడటం, చివర్లో వేగం పెంచడం దూబే ప్రత్యేకత. 23 బంతుల్లో 65, 31 బంతుల్లో 66 వంటి ఇన్నింగ్స్‌లు అతని మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యాన్ని రుజువు చేశాయి.
Also Read
- Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
- RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
Also Read: Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!
ఒత్తిడిలోనూ శివమ్ దూబే చూపిస్తున్న ధైర్యం జట్టుకు భరోసా కలిగిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో దూబే దున్నేస్తున్నాడు. వెస్టిండీస్‌పై చావోరేవో మ్యాచ్‌లో కూడా 19వ ఓవర్లో రెండు కీలక బౌండరీలు బాది.. మొత్తం ఒత్తిడిని తగ్గించాడు. దాంతో చివరి ఓవర్లో భారత్ సునాయాస విజయం సాధించింది. ఫినిషర్ బాధ్యతను దూబే సమర్థంగా నిర్వర్తిస్తూ భారత్‌కు కీలక ఆయుధంగా మారుతున్నాడు. ఎప్పటికప్పుడు మంచి ప్రదర్శనలు ఇస్తూ జట్టులో తన స్థానం బలపరుచుకుంటున్నాడు. దూబే ఇప్పుడు కేవలం ఆల్‌రౌండర్ మాత్రమే కాదు.. టీమిండియాకు అసలైన ‘ఫినిషర్’గా ఎదుగుతున్నాడు.
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!