Site icon NTV Telugu

Shashi Tharoor: శ్రీలంక టూర్‌కు భారత్.. వారిని పక్కన పెట్టడంపై శశిథరూర్ సీరియస్..!

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు టీమిండియా జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది. టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలో ప్లేయర్స్ ను ఎంపిక చేశారు. అయితే, వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌, టీ20లకు అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర దుమారం చేలరేగుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్‌కు చెందిన తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో పాటు క్రికెట్‌ సంబంధిత విషయాలపైనా శశిథరూర్‌ అప్పుడప్పుడు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు టీమ్స్ సెలక్షన్‌పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్

కాగా, ఈ నెల 27 నుంచి భారత్‌- శ్రీలంక మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. అందుకోసం ప్లేయర్స్ ను బీసీసీఐ సెలక్ట్ చేసింది.. ఇక, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రికార్డు సెంచరీ చేసిన అభిషేక్‌ శర్మను టీ20లకు, అద్భుతమైన బ్యాటింగ్ చేసి సంజూ శాంసన్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు అంటూ శశిథరూర్ మండిపడ్డారు. ఇలాంటి అద్భుతాలు చేసేవారి ప్రదర్శన సెలక్టర్లకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుండొచ్చు.. ఇక, శ్రీలంక టూర్ కి ఎంపికైన ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మన టీమ్ కు ఆల్‌ ది బెస్ట్ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ క్యాప్షన్ ఇచ్చారు.

Exit mobile version