భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆట చివరి రోజు విజయానికి ఇండియాకు 9 వికెట్లు కావాల్సి ఉండగా… 8 వికెట్లు సాధించిన భారత బౌలర్లు ఆఖరి వికెట్ ను పడగొట్టలేకపోయారు. దాంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందించారు. ఈ మ్యాచ్ లో భారత జట్టుకు కొత్త బంతి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా దానిని తీసుకోలేదు. ఆ బంతినే ఎక్కువగా నాలుగు ఓవర్లు వేయడానికి ఉపయోగించారు.
అయితే ”కొత్త బంతి అందుబాటులోకి వచ్చినప్పుడు భారత్ దానిని తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం!… పాత బంతితో వేసిన 4 ఓవర్లు టర్నింగ్ పాయింట్ అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. అయితే కొత్త బంతి తీసుకున్న తర్వాత భారత పిసినారి జడేజా దానితో వేగంగా రెండు వికెట్లు పడగొట్టాడు. కాబట్టి ఇండియా విజయానికి ఒక్క వికెట్ దూరమే ఉండటంతో ఆ ఓవర్లు కీలకం కావచ్చు అనే అభిమానులు అంటున్నారు.