Shane Warne-RR: షేన్ వార్న్ మాస్టర్ మైండ్.. రాజస్థాన్ రాయల్స్ నుంచి రూ.460 కోట్లు!
- దివంగత షేన్ వార్న్ మాస్టర్ మైండ్
- ఆ కాలంలో రూ.9.35 కోట్లే జీతం
- నాలుగు సీజన్లలో 3 శాతం వాటా
- ఇప్పుడు వార్న్ కుటుంబానికి రూ.460 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shane Warne To Get RS 460 Crore From Rajasthan Royals: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ నిజంగా మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. మైదానంలోనే కాదు.. ఆర్థిక నిర్ణయాల్లో కూడా ఎంత తెలివిగా వ్యవహరించారనే ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో వార్న్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రాజస్థాన్ నుంచి ఏకంగా రూ.460 కోట్లు వార్న్ కుటుంబానికి దక్కనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ తరఫున షేన్ వార్న్ నాలుగు సీజన్లు ఆడారు. ఆ కాలంలో (2008) మొత్తంగా రూ.9.35 కోట్లే జీతంగా తీసుకున్నారు. అయితే ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం జీతంతో సరిపెట్టుకోకుండా.. ప్రతి సీజన్‌కు 0.75 శాతం ఈక్విటీ (షేర్లు) ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. రాజస్థాన్ యాజమాన్యం కూడా అందుకు అంగీకరించింది. దాంతో వార్న్‌కు నాలుగు సీజన్లలో మొత్తం 3 శాతం వాటా దక్కింది. ఇప్పుడు రాజస్థాన్ ఫ్రాంచైజీ మరో చేతికి మారగా.. ప్రాంచైజీ విలువ ఆకాశాన్ని తాకింది. తాజాగా జట్టును ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్ల (రూ.15,301 కోట్లు) భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
Also Read
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
Also Read: RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్, నిజమేనా?
దీంతో షేన్ వార్న్ సంపాదించిన 3 శాతం వాటా విలువ ఇప్పుడు సుమారు రూ.460 కోట్లకు చేరింది. ఈ భారీ మొత్తం ఇప్పుడు అతని కుటుంబానికి, పిల్లలకు అందనుంది. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది. వార్న్ 2022లో మృతి చెందిన విషయం తెలిసిందే. మైదానంలో తన మాంత్రిక బౌలింగ్‌తో అభిమానులను అలరించిన వార్న్.. మైదానం బయట కూడా ఎంత దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నాడో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. చిన్న జీతంతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు వందల కోట్ల సంపదగా మారడం నిజంగా అద్భుతమే.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!