Shakib Al Hasan: టీమిండియాపై బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు
Shakib Al Hasan: టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అతడు 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబుల్ హసన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో స్పిన్నర్‌గా నిలిచాడు. గతంలో టీమిండియాపై 5 వికెట్లు సాధించిన స్పిన్నర్లలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ మాత్రమే ఉన్నారు.
Read Also: Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ
Also Read
- Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
- MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
- Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. "ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం".. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..
మరోవైపు టీమిండియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గానూ షకీబ్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ యాష్లే గైల్స్ పేరిట ఉండేది. 2002లో ఇండియాపై గైల్స్ 10-0-57-5 ప్రదర్శన చేశాడు. అతడి రికార్డును తాజాగా షకీబ్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం షకీబుల్ హసన్ బంగ్లాదేశ్‌కు కీలక ఆటగాడిగా మారాడు. అగ్రశ్రేణి జట్లపై బ్యాటుతో పాటు బంతితోనూ రాణిస్తున్నాడు. టీ20లు, టెస్టులకు కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు. 372 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకుల్లోనూ షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 59 టెస్టులు ఆడిన షకీబుల్ హసన్ బౌలింగ్‌లో 215 వికెట్లు తీశాడు. వన్డేల్లో 215 వికెట్లు సాధించాడు.
తాజావార్తలు
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో