రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికీ.. సెంచరీ సాధించిన కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. హోప్ సెంచరీ చేయడమే కాకుండా.. లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సాధించలేని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా హోప్ రికార్డుల్లో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని సభ్య దేశాల జట్లపై సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా షాయ్ హోప్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హోప్ 11 పూర్తి సభ్య దేశాలపై శతకాలు బాదాడు. ఇంతకుముందు ఏ బ్యాట్స్‌మన్ కూడా ఈ ఘనతను సాధించలేదు. భారత్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై హోప్ సెంచరీలు చేశాడు. అత్యధికంగా ఇంగ్లాండ్, భారత్ జట్లపై నాలుగేసి సెంచరీలు బాదాడు. ఓ బ్యాటర్ అన్ని సభ్య దేశాల జట్లపై సెంచరీలు చేయడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలిసారి.
Also Read: Ramchander Rao: టైమ్ కూడా ఇవ్వం, జైలుకు పంపిస్తాం.. బీజేపీ కార్యకర్తలకు అధ్యక్షుడు వార్నింగ్!
ఏ జట్టుపై ఎన్ని సెంచరీలు:
4 vs ఇండియా (41 ఇన్నింగ్స్‌లలో)
4 vs ఇంగ్లాండ్ (57 ఇన్నింగ్స్‌లలో)
3 vs బంగ్లాదేశ్ (31 ఇన్నింగ్స్‌లలో)
2 vs పాకిస్తాన్ (23 ఇన్నింగ్స్‌లలో)
2 vs శ్రీలంక (29 ఇన్నింగ్స్‌లలో)
1 vs జింబాబ్వే (7 ఇన్నింగ్స్‌లలో)
1 vs దక్షిణాఫ్రికా (10 ఇన్నింగ్స్‌లలో)
1 vs ఆఫ్ఘనిస్తాన్ (12 ఇన్నింగ్స్‌లలో)
1 vs ఐర్లాండ్ (13 ఇన్నింగ్స్‌లలో)
1 vs న్యూజిలాండ్ (19 ఇన్నింగ్స్‌లలో)
1 vs ఆస్ట్రేలియా (24 ఇన్నింగ్స్‌లలో)