రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికీ.. సెంచరీ సాధించిన కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. హోప్ సెంచరీ చేయడమే కాకుండా.. లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సాధించలేని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా హోప్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో…