Shahid Afridi: భారత్‌పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..
- నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ ఎందుకు..
- షాదాబ్ ఖాన్‌పై షాహిద్ అఫ్రిది విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: ఇండియా చేతిలో దారుణ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు బాబర్ అజమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిది ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి తమను నిందించడంపై పాక్ క్రికెటర్, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ స్టార్ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఘాటుగా స్పందించాడు. 2021లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించిన విషయాన్ని ఒప్పుకుంటూనే.. ఆ తర్వాత వరసగా పరాజయాల పాలైన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుత టీ20 టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన మాజీలు, ప్రస్తుత ఆటగాళ్ల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. మాజీల విమర్శలపై షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ మా మాజీ క్రికెటర్లకు వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు పాక్ కోసం గొప్ప పనులు చేశారు. 2021 ప్రపంచకప్‌లో మేము ఇండియాను ఓడించాము’’ అని అన్నారు.
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
Read Also: Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
ఈ విషయాన్ని షాహీద్ అప్రిది ఒప్పుకుంటూనే, ఆ తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుత ప్లేయర్లకు తమలో తమకు ఎన్ని విభేదాలు ఉన్నా, జట్టుగా రాణించలేకపోయారని విమర్శించారు. షాదావబ్ ఖాన్ బాగా ఆడనప్పుడు, అతడిని జట్టు నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సీనియర్లు మద్దతు ఇచ్చిన విషయాన్ని అఫ్రిది గుర్తు చేశారు.
నమీబియా వంటి జట్టుపై షాదాబ్ ఖాన్ చెలరేగి ఆడటాన్ని అఫ్రిది ప్రస్తావించాడు. కేవలం నువ్వు నమీబియాపై ఆడావు, పెద్ద జట్లపై ఆడి చూపించు అని సవాల్ విసిరారు. నమీబియాపై షాదాబ్ ఖాన్ 22 బాల్స్‌లో 36 రన్స్ చేశాడు. 3/19 బెస్ట్ బౌలింగ్ గణాంకాలు సాధించాడు. కానీ భారత్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 14 రన్స్, ఒక ఓవర్ వేసి 17 పరుగులు ఇచ్చి తీవ్ర విమర్శల పాలయ్యాడు.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!