Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Saudi Arabia Beat Argentina In Fifa World Cup 2022

FIFA World Cup: అర్జెంటీనాకు షాక్.. సౌదీ అరేబియా ఘనవిజయం

Published Date :November 22, 2022 , 6:21 pm
By Ramesh Nalam
FIFA World Cup: అర్జెంటీనాకు షాక్.. సౌదీ అరేబియా ఘనవిజయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

FIFA World Cup: ఖతార్‌‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌ టోర్నీలో మూడో రోజు పెను సంచలనం నమోదైంది. బలమైన జట్టు అర్జెంటీనాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న అర్జెంటీనాను 2-1 తేడాతో సౌదీ అరేబియా ఓడించి పెను సంచలనం నమోదు చేసింది. అర్జెంటీనా తరఫున సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మాత్రమే గోల్ చేశాడు. ఆట మొదలైన 9వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ గోల్‌గా మలిచాడు. అయితే తొలి హాఫ్‌లో అర్జెంటీనా ఒక గోల్ చేయగా సెకండ్ హాఫ్‌లో సౌదీ అరేబియా రెండు గోల్స్ చేసింది. రెండో హాఫ్ ప్రారంభమైన కాసేపటికే 47వ నిమిషంలో సౌదీ అరేబియా ఆటగాడు అల్ షెహ్రీ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో సమంగా నిలిచింది.

Read Also: బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అట్టర్ ప్లాప్ ను అందుకున్న స్టార్ హీరోలు..

ఆ తర్వాత 57వ నిమిషంలో సౌదీ అరేబియా మరో గోల్ చేసి ఆధిపత్యం చెలాయించింది. ఆ జట్టు ఆటగాడు సలీమ్ అల్ దవాసరి అద్భుత రీతిలో గోల్ సాధించడంతో అర్జెంటీనా తెల్లముఖం వేసింది. పటిష్టమైన అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించుకుని టాప్ రైట్ కార్నర్ ఎండ్ నుంచి సలీమ్ గోల్ చేయడం విశేషం. అనంతరం అర్జెంటీనా పదే పదే సౌదీ అరేబియా గోల్ పోస్టుపై దాడి చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. కాగా స్టార్ ఆటగాడు మెస్సీ తన హయాంలో ఇప్పటివరకు తన జట్టుకు ఒక్క ప్రపంచకప్ కూడా అందించలేకపోయాడు. అటు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గత 36 మ్యాచ్‌లలో ఓటమి ఎరుగని అర్జెంటీనాకు సౌదీ అరేబియా లాంటి జట్టు ఓటమి రుచి చూపించింది.

Saudi Arabia beat Argentina. @adidasfootball | #FIFAWorldCup

— FIFA World Cup (@FIFAWorldCup) November 22, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Argentina
  • fifa world cup 2022
  • foot ball world cup
  • saudi arabia
  • sports news

తాజావార్తలు

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions