Sanju Samson-Gambhir: సంజు అసంతృప్తి.. గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం.. సోషల్ మీడియాలో రచ్చ!
- రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం
- ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్ అవుట్
- టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంఫై సోషల్ మీడియాలో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir trying to convince Sanju Samson: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. బుడ్డోడికి అవకాశం రావడంతో వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంఫై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వడాన్ని చాలామంది స్వాగతిస్తున్నప్పటికీ.. టీ20 ప్రపంచకప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజును కేవలం మూడు వైఫల్యాల కారణంగా పక్కన పెట్టడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సంజు శాంసన్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంతో సంజు అసంతృప్తిగా కనిపించాడు. అతడికి గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అవకాశం ఎందుకు ఇవ్వలేదో గౌతీ స్పష్టంగా సంజుకి చెప్పినట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. సంజు అక్కడినుంచి వెళుతున్నా.. గంభీర్ ఆపి మరి మాట్లాడాడు. చివరకు సంజు కన్విన్స్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
సంజు శాంసన్ ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఐర్లాండ్ సిరీస్‌లోను రెండు, ఇంగ్లండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో జట్టు యాజమాన్యం వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది. మరోవైపు వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో 10 బంతుల్లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. సంజును తప్పించడంపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, అంబటి రాయుడు వంటి వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైభవ్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమే అయినప్పటికీ.. సంజు వంటి సీనియర్ ఆటగాడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
Sanju Samson was clearly not happy after being dropped. Gautam Gambhir was trying hard to convince him 💔 pic.twitter.com/3GwPPF5e6L
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) July 5, 2026
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!