Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?

  • టాలెంట్, ఫామ్ ఉందా అంటే ఉంది
  • అవకాశాలు మాత్రం సంజుకు ఎక్కువగా రాలేదు
  • రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు
Sanju Samson

Sanju Samson

భారత క్రికెట్ అభిమానులను తరచూ ఆలోచనలో పడేసే పేరు ‘సంజు శాంసన్’. టాలెంట్ ఉందా అంటే ఉంది, ఫామ్ ఉందా అంటే ఉంది.. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. ఈ రెండేళ్ల మధ్యనే అతడు భారత జట్టుకు తరచుగా ఆడుతూ వచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో ఉన్న సంజు.. 2026 టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2026 టోర్నీ జరుగుతుండగా.. సంజు మొత్తం 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నాడు. అయితే అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.

2024 టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ పరిస్థితి బాధాకరం అనే చెప్పాలి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు.. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సంజు జట్టుతో ఉన్నాడు. లీగ్, సూపర్ 8, సెమీఫైనల్, ఫైనల్ వరకు అతడి పాత్ర ఒక్కటే.. అదే వాటర్ బాయ్. మైదానంలో పరుగులు చేయాల్సిన బ్యాట్ చేతిలో ఉండాల్సింది పోయి.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నీళ్ల బాటిల్ పట్టుకుని మైదానానికి రావడమే సంజు పని అయింది. ఇక 2026లో పక్కాగా ఆడుతాడని అందరూ ఆశపడ్డారు. కానీ 2026 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కూడా పరిస్థితి మారలేదు. మరోసారి సంజూ తుది జట్టులోకి రాలేదు. మళ్లీ అదే కథ, అదే పాత్ర.

Also Read: T20 World Cup 2026: జియో హాట్‌స్టార్ వ్యూస్ సంచలనం.. వరల్డ్ క్రికెట్‌ను ఏలుతున్న భారత క్రికెట్ ఫాన్స్!

2024 టీ20 ప్రపంచకప్‌ ముందు కాస్త ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్.. 2026 ప్రపంచకప్‌ ముందు అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో.. తుది జట్టులో చోటు దక్కడం లేదు. రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నా.. వాటర్ బాయ్ పాత్రకే పరిమితం అవుతున్నాడు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా అవకాశం ఇవ్వండి అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.