Sanju Samson: 21 సార్లు ఫెయిలైనా 22వ సారి ఛాన్స్ ఇస్తా అన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన సంజు!
- 2026 టీ20 ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన
- భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో సంజు కీలక పాత్ర
- ఆసక్తికర విషయం చెప్పిన సంజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కెరీర్ గత పదేళ్లుగా ఒడిదుడుకులతో సాగినా.. 2026 టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో తనదైన ముద్ర వేశాడు. పదేళ్ల నిరీక్షణ తర్వాత జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. కీలక మ్యాచుల్లో అదరగొట్టి భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలను, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను సంజు పంచుకున్నాడు.
ఒకానొక సమయంలో వరుస వైఫల్యాలతో డ్రెస్సింగ్ రూమ్‌లో దిగాలుగా కూర్చున్న తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ధైర్యాన్ని ఇచ్చారని సంజు శాంసన్ గుర్తు చేసుకున్నాడు. ‘వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నానని బాధపడుతుంటే గంభీర్ నా దగ్గరకు వచ్చారు. విషయం చెప్పాను. నువ్వు 21 సార్లు ఫెయిలైనా పర్లేదు, 22వ సారి కూడా నేనే నిన్ను బ్యాటింగ్‌కు పంపిస్తా. అవకాశాల గురించి చింతించకుండా నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టు అని చెప్పారు. ఆ మాటలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి’ అని సంజు వివరించాడు.
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
2026 టీ20 ప్రపంచ కప్‌లో ముందుగా సంజు శాంసన్‌కు అవకాశాలు రాలేదు. గాయాల కారణంగా అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లపై హాఫ్ సెంచరీలతో మెరిసిన సంజు శాంసన్.. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విశ్వరూపం చూపించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. వరుసగా మూడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన సంజును ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు వరించింది. దీంతో ప్రస్తుతం టీ20 జట్టులో అతడి స్థానం ఖాయమైంది.
క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలోని ఒక మధుర జ్ఞాపకాన్ని సంజు శాంసన్ పంచుకున్నాడు. తాను చిన్నప్పటి నుండి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానినని తెలిపాడు. ‘ఏడో తరగతిలో పరీక్ష ఉన్నా చదవకుండా రజనీ సినిమా చూస్తున్నందుకు అమ్మానాన్న తిట్టారు. అప్పుడు పౌరుషంతో ఏదో ఒక రోజు గొప్పవాడినై రజనీకాంత్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలుస్తా అని ఛాలెంజ్ చేశాను. సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆయనే నన్ను స్వయంగా ఇంటికి ఆహ్వానించడం, నేను వెళ్లి కలవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి’ అని సంజు భావోద్వేగానికి లోనయ్యాడు.
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!