Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాకు ఎన్నో అవార్డులను అందించిన ఆమె పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లాడింది. అప్పట్లో వీరి పెళ్లి ఎన్ని సంచలనాలకు దారితీసిందో అందరికి తెల్సిందే. ఒక ఇండియన్ అయ్యి ఉండి.. పాకిస్థాన్ ను ఎలా పెళ్లాడతావు అంటూ సానియాను అందరు ట్రోల్ చేశారు. ఇక ఆ విమర్శలను అన్ని తట్టుకొని సానియా, షోయబ్ తో ఎంతో ఆనందంగా జీవించింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇజాన్ అనే బాబు కూడా ఉన్నాడు. ఇక 12 ఏళ్ళ తరువాత ఈ జంట మధ్య కలతలు రేగాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం సానియా పెట్టిన ఒక ట్వీట్. “ముక్కలు అయిన హృదయం ఎక్కడికి వెళ్తోంది.. అల్లాను అన్వేషిస్తుంది” అంటూ ఉర్దూలో ఆమె పెట్టిన ట్వీట్ ఈ పుకార్లకు కారణం అయ్యింది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా ఈ జంట విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. అప్పుడెప్పుడో కొడుకు పుట్టినరోజుకు కలిసి కనిపించిన ఈ జంట ఇప్పటివరకు కెమెరా కంటికి జంటగా కనిపించలేదు.
భర్తతో విసిగిపోయి సానియా విడిగా ఉంటుందని అంటున్నారు. ఇక మరోపక్క విడాకులు కన్ఫర్మ్ కూడా అయిపోయాయని చెప్పుకొస్తున్నారు. అందుకు కూడా నెటిజన్లు ఒక కారణం చెప్తున్నారు. గత మూడు రోజులుగా సానియా విడాకులు అంటూ నెట్టింట ట్రెండ్ అవుతున్నా ఆమె స్పందించింది లేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుకార్లు నిజం అని చెప్పడానికే సానియా తన కొడుకుతో ఉన్న ఫోటోలను మాత్రమే షేర్ చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు. సరే ఒకవేళ విడాకులు తీసుకొని ఉంటే ఆమె దుబాయ్ లో ఉండడం ఎందుకు.. ఇండియాకు తిరిగి వచ్చేయొచ్చుగా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ మిస్టరీ వీడాలంటే సానియా నోరు విప్పాలని అందరు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ విడాకులు నిజమైతే సానియా ఇండియా వచ్చే అవకాశాలు ఉన్నాయా..? లేదా..? అనేది కూడా తెలియాలి.