Gill vs Rohit: భారత వన్డే జట్టుకు సంబంధించిన కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించారు. శుభ్‌మన్ గిల్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి, మళ్లీ రోహిత్ శర్మను నియమించాలని కోరారు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ “కోర్స్ కరెక్షన్” చేసుకునే సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, 2025 అక్టోబర్‌లో రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.. కానీ, ఇప్పటి వరకు అతడి నాయకత్వంలో భారత్ ఆడిన రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది.. గిల్ కెప్టెన్సీ అరంగేట్రం ఆస్ట్రేలియాలో జరిగింది.. ఆ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది.. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు గిల్ దూరమయ్యాడు. ఇక, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా భారత్ ఓడిపోవడంతో గిల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: US: అమానుషం.. 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
అయితే, InsideSportతో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. మన లక్ష్యం 2027 ప్రపంచకప్. ఇప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటే న్యూజిలాండ్ సిరీస్ ఫలితం వేరేలా ఉండేదని తెలిపారు. రోహిత్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో జట్టు సరైన దిశలో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. శుభ్‌మన్ గిల్‌తో పోలిస్తే రోహిత్ శర్మ చాలా మెరుగైన కెప్టెన్ అని స్పష్టం చేశారు. అందుకే అతను అంతగా విజయవంతమయ్యాడు అని తెలిపారు. ఇక, గిల్ నాయకత్వంలో కూడా ప్రపంచకప్ గెలవొచ్చు.. కానీ ఇద్దరి కెప్టెన్సీలను పోల్చి చూడాలి అని తివారీ సూచించారు.
Read Also: Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
ఇక, రోహిత్ కెప్టెన్ అయితే ప్రపంచకప్ గెలిచే అవకాశం ఎంత? గిల్ కెప్టెన్ అయితే అవకాశం ఎంత? అని అడిగితే.. ఎక్కువ మంది రోహిత్ ఉంటే 85 నుంచి 90 శాతం వరకు గెలిచే ఛాన్స్ ఉంటుందని చెబుతారు అని మనోజ్ తివారీ అన్నారు. కాగా, భారత వన్డే జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని మనోజ్ తివారీ తెలిపారు. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తే 2027 ప్రపంచకప్‌పై భారత జట్టు అవకాశాలు మరింత బలపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.