INDvsNZ T20: కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దుమ్మురేపింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి వన్డే ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో మంచి బోణీ కొట్టింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఈ సమయంలోనే టీమిండియా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో కీలక ఆటగాడిగా ఉన్న గైక్వాడ్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో సిరీస్ ఆడటంపై సందేహం నెలకొంది. గైక్వాడ్ మణికట్టు నొప్పితో బాధపడుతున్నట్టుగా సమాచారం. హైదరాబాద్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గైక్వాడ్‌కు ఈ గాయం అయింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గైక్వాడ్ అంతగా రాణించలేదు. కానీ ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజా రంజీ ట్రోఫీలో తమిళనాడుపై 195 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీలు సాధించాడు. గత 10 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు చేశాడు.
Oscars: ఈ సినిమాకి 10 ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి…
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
న్యూజిలాండ్‌తో జనవరి 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, గైక్వాడ్ సరైన సమయానికి ఫిట్‌గా లేకపోతే ఈ సిరీస్‌కు ఎంపికైన పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2021 శ్రీలంక పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడిన పృథ్వీ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేదు. వెన్ను గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే NCAలో శిక్షణ పొందుతున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి 2 టెస్టుల కోసం అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!