Oscars: ఈ సినిమాకి 10 ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీ పది కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది.
డానియెల్ క్వాన్, డానియెల్ షీనర్ట్ లు దర్శకత్వం వహించిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీలో ‘మిచ్చేల్ యోవ్’ మెయిన్ లీడ్ ప్లే చేశారు. మార్చ్ 25న అమెరికాలో రిలీజ్ అయిన ఈ మూవీ 25 మిలియన్ డాలర్స్ బడ్జట్ తో తెరకెక్కి 104 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. గోల్డెన్ గ్లోబ్ నుంచి క్రిటిక్స్ సర్కిల్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇలా పోటీ చేసిన ప్రతి చోటా “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా అవార్డులు గెలిచింది. మార్చ్ 12న కూడా “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” మూవీ లీస్ట్ కేస్ లో ఆరు ఆస్కార్స్ గెలుస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఒక తల్లి-కూతురి కథతో తెరకెక్కిన “ఎవరీ థింగ్ ఎవరీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా ఈ ఏడాది ఇంటర్నేషనల్ సినిమాని ఏలుతుంది. ఒకవేళ ఈ మూవీ చూడాలి అనుకుంటే “లయన్స్ గేట్ ఒటీటీ”లో ఉంది చూసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!