Pune Man Forced His Wife To Sleep With Boss For Promotion: ఎవరైనా స్వయంకృషితో ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రయత్నిస్తారు. తమ ప్రతిభతో బాస్ వద్ద మంచి మార్కులు కొట్టేసి, ప్రమోషన్స్ పొందేందుకు శ్రమిస్తారు. కానీ.. ఓ ప్రబుద్ధుడు మాత్రం అడ్డదారిలో ప్రమోషన్ పొందాలనుకున్నాడు. తన భార్యను బాస్ వద్దకు ఒక రాత్రి పంపించి, తాను లాభం పొందాలని చూశాడు. ఇలాంటి పాడు పని చేసేందుకు తనకు ఇష్టం లేదని చెప్పినా.. భర్త మాత్రం వినిపించుకోకుండా, ఒత్తిడి చేశాడు. చివరికి సహనం కోల్పోయిన ఆ మహిళ, భర్తకు తగిన బుద్ధి చెప్పింది. అతడ్ని కోర్టుకీడ్చింది. మహారాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Revanth Reddy: గవర్నర్, ప్రభుత్వం ఒక్కటే.. అదంతా డ్రామా మాత్రమే
పూణెకు చెందిన అమిత్ ఛాబ్రాకు కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. వీరిద్దరికి 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే.. కంపెనీలో ప్రమోషన్స్‌తో పాటు ఇతర ప్రోత్సాహకాలు పొందడం కోసం, అమిత్ తన భార్యను బాస్‌తో పడుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. తాను ఈ పాడు పని చేయనని చెప్పినా సరే, ప్రమోషన్ దక్కాలంటే బాస్‌తో పడకగది పంచుకోవాల్సిందేనని వేధింపులు పెట్టాడు. దీంతో.. ఆ మహిళ కోర్టుకెక్కింది. బాస్‌తో పడుకోవాలని భర్త తనను ఒత్తిడి చేస్తున్నాడని, ప్రమోషన్ పొందడం కోసమే ఇలా వేధిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ సోదరుడైన రాజ్ కూడా తన పట్ల అనుచితంగా వ్యవహరించాడని, దాంతో తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని తెలిపింది. తన 12 ఏళ్ల కుమార్తె ఎదుటే.. రాజ్ తనను పలుమార్లు వేధించాడని చెప్పింది. తాను ప్రతిఘటించినందుకు.. తనను దారుణంగా కొట్టారని వెల్లడించింది.
Uzbekistan Child Deaths: చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందు కేసులో ముగ్గురి అరెస్ట్..
ఈ వేధింపులు భరించలేక తాను ఒకసారి చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయినా భర్త, అతని సోదరుడి నుంచి వేధింపులు తగ్గలేదని.. దాంతో తాను 2022 ఆగస్టులో ఇండోర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయానని తెలిపింది. తనపై జరుగుతున్న వేధింపుల గురించి తానను తల్లికి మొదట్లో చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి తన తల్లికి జరిగిన విషయం చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు, రాతపూర్వకంగా భార్యను హింసించనని అమిత్ హామీ ఇచ్చాడంది. అయినా.. కొన్నాళ్లకు తిరిగి వేధించడం మొదలుపెట్టారని, దీంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు భావోద్వేగానికి లోనైంది. ఆమె ఫిర్యాదు మేరకు.. భర్త, బావమరిది, అత్తపై కేసు నమోదు చేశారు.